అక్షరటుడే, వెబ్‌డెస్క్: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.. తెలంగాణ Telangana రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తోంది. ఎరువుల కోసం రైతులు అల్లాడుతున్నారు.
క్యూ లైన్లలో రోజంతా నిలబడుతూ తంటాలు పడుతున్నారు. అతి కష్టం మీద దొరికన బస్తాలను తలపై ఎత్తుకుని చేను వరకు మోసుకెళ్తున్నారు. కాగా, యూరియాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో దొంగలు చేనుల వెంట పడ్డారు. పంట పొలాల్లో నుంచి యూరియా బస్తాలను ఎత్తుకెళ్తున్నారు.
తాజాగా కామారెడ్డి జిల్లా Kamareddy district భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి గ్రామంలోని పంట పొలాల్లో దొంగతనం జరిగింది. సోమవారం (సెప్టెంబరు 15) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితుడు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తక్కల్ల గంగారెడ్డి తన పొలంలోని మక్క(మొక్కజొన్న) పంటకు ఎరువు వేయడానికి యూరియా బస్తాలను తీసుకొచ్చారు.
వాటిని పొలంలోని వ్యవసాయ బావి agricultural well వద్ద నిల్వ చేశారు. కాగా, అక్కడికి బైక్పై చేరుకున్న ఇద్దరు యువకులు యూరియా Urea బస్తాలను ఎత్తుకెళ్లారు.
Urea bag theft | సీసీ కెమెరాలో రికార్డు
వాహనంపై మక్క కర్రలు అడ్డుగా పెట్టి, వాటి కింద యూరియా బస్తా వేసుకొని పారిపోయారు. యూరియా బస్తా చోరీ అయిన విషయం గ్రహించిన రైతు వెంటనే ఎంక్వరీ చేస్తూ టోల్ ప్లాజా toll plaza వద్దకు చేరుకున్నారు.
అక్కడ సీసీ కెమెరాలో ఇద్దరు యువకులు యూరియా బస్తా ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో ఆ వీడియోను తీసుకుని వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అదికాస్త వైరల్ అయింది.
అలా దొంగతనం ఫొటో యువకుల ఫోన్కు కూడా రావడంతో.. వెంటనే యూరియా బస్తా తీసుకుని బాధిత రైతు వద్దకు చేరుకున్నారు. రైతుకు క్షమాపణ చెప్పి, బస్తాను అతడికే ఇచ్చేశారు.