అక్షరటుడే, ఇందూరు: Mann Ki Baat | ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) ఆదివారం తన కార్యాలయంలో వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశాభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ప్రధాని ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు.
ఐదేళ్ల తర్వాత భారత్-చైనా(Chaina) మధ్య విమాన సేవలు పునరుద్ధరించడం కారణంగా వాణిజ్యం పెరుగుతుందన్నారు. పర్యాటక రంగం పెరిగి సత్సంబంధాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధాని మన్ కీ బాత్ దేశ ప్రజల్లో జాతీయతాభావం సేవ స్ఫూర్తి పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తుందని వెల్లడించారు.

