Homeజిల్లాలునిజామాబాద్​Palaj Ganapathi | పాలజ్ గణపతిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే

Palaj Ganapathi | పాలజ్ గణపతిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Palaj Ganapathi | పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) అన్నారు.

తెలంగాణ (Telanagana), మహారాష్ట్ర (maharastara) సరిహద్దులో కొలువుదీరిన పాలజ్ కర్ర గణపతిని (palaj karra Ganapathi) బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కర్ర గణపతి ఆలయం ఎన్నోతరాలుగా భక్తుల నమ్మకానికి కేంద్ర బిందువుగా నిలుస్తోందన్నారు.

ఏడు దశాబ్దాల క్రితం వ్యాధులతో ఇబ్బందులు పడితే నిర్మల్ (Nirmal) జిల్లా కొయ్యబొమ్మల కళాకారులు ఒకే చెక్కతో గణపతిని తయారు చేశారని గుర్తు చేశారు. 11 రోజులు వినాయకుడిని పూజిస్తే వ్యాధులు దూరమవుతాయనే విశ్వాసంతో భక్తులు కొలుస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News