Homeబిజినెస్​Urban Company IPO | అద‌ర‌గొట్టిన అర్బ‌న్ కంపెనీ.. 58 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌

Urban Company IPO | అద‌ర‌గొట్టిన అర్బ‌న్ కంపెనీ.. 58 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urban Company IPO | అర్బ‌న్ కంపెనీ అద‌ర‌గొట్టింది. తొలిరోజే ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాల పంట ప‌డించింది. ఇటీవ‌లే ఐపీవోకు వ‌చ్చిన అర్బ‌న్ కంపెనీ(Urban Company) కి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. సెప్టెంబర్ 10 నుంచి 12 మధ్య బిడ్ల‌ను ఆహ్వానించ‌గా, 103.63 రెట్లు సబ్‌స్క్రిప్షన్ న‌మోదైంది.

ఈ నేప‌థ్యంలో పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించిన అర్బ‌న్ కంపెనీమార్కెట్‌లోకి ఘ‌నంగా ఎంట్రీ ఇచ్చింది. మంగ‌ళ‌వారం భారీ లాభాల‌తో స్టాక్‌మార్కెట్‌(Stock Market)లోకి అరంగేట్రం చేసింది. ఐపీవో ధర కంటే 57 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి.

Urban Company IPO | బంప‌ర్ ఎంట్రీ..

యాప్ ఆధారిత బ్యూటీ, హోమ్ సర్వీసెస్(Home Services) ప్లాట్‌ఫామ్ అయిన అర్బన్ కంపెనీ రూ.1,900 కోట్ల స‌మీక‌రించేందుకు ఐపీవోకు వ‌చ్చింది. ఒక్కో షేరు గ‌రిష్ట ధ‌ర రూ.103నిర్ణ‌యించ‌గా, వంద శాతానికి పైగా స‌బ్‌స్క్రిప్ష‌న్ అయింది. మంగ‌ళ‌వారం మార్కెట్‌లోకి ఎంట్రీ కాగా, NSEలో ఒక్కో షేరుకు రూ.162.25 వద్ద లిస్టింగ్ అయింది. ఇది ఇష్యూ ధర కంటే 57.52 శాతం అధికం. ఇక‌, BSEలో షేర్లు ఒక్కొక్కటి రూ.161 వద్ద,56.31 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. షేర్ల లిస్టింగ్ తర్వాత కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 23,118.02 కోట్లుగా న‌మోదైంది. ఇన్వెస్ట‌ర్ల‌కు గ్రే మార్కెట్ కంటే అధికంగా లాభాల‌ను తెచ్చిపెట్టింది