ePaper
More
    Homeబిజినెస్​Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీవోకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్...

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీవోకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు తొలి రోజే దుమ్మురేపింది. ప్రైమరీ మార్కెట్లో షేర్లు అమ్మకానికి పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే బలమైన సబ్​స్క్రిప్షన్​ను (subscription) చూసింది.

    ఇష్యూ మొదటి రోజు రెండు గంటల్లోనే పూర్తిగా సబ్​స్క్రైబ్​ అయింది. NSE డేటా (NSE data) ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకే ఓవర్ సబ్ స్క్రిప్షన్ అయింది. రూ.1,900 కోట్ల విలువైన 10.67 కోట్ల షేర్లు విక్రయానికి పెట్టగా, తొలిరోజే 19.59 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

    Urban Company IPO | ఫుల్ సబ్ స్క్రిప్షన్..

    యాప్ ఆధారిత బ్యూటీ, హోమ్ సర్వీసెస్ ప్లాట్​ఫాం (home services platform) అయిన అర్బన్ కంపెనీ రూ.1900 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరుకు రూ.98 నుండి రూ.103 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధరలో కంపెనీ వాల్యుయేషన్ రూ.14,790 కోట్లుగా అంచనా వేయబడింది. 145 షేర్లతో కూడిన ఒక్కో లాట్ కు రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు.

    మంగళవారం ప్రారంభమైన ఐపీవో గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తొలిరోజే ఇన్వెస్టర్ల భారీ స్పందన లభించింది. సంస్థాగతేతర పెట్టుబడిదారుల కోటా 2.04 రెట్లు సబ్​స్క్రిప్షన్​ పొందింది. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల వర్గం 4.52 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల భాగం 20 శాతం స్క్రిప్షన్​ పొందింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.854 కోట్లు సేకరించింది.

    Urban Company IPO | లాభాలు పంచనున్న ఐపీవో..

    ఐపీవో బిడ్డింగ్ దాఖలు ముగింపునకు మరో రెండ్రోజులు గడువుంది. ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఎన్ఐఐలు, క్యూఐబీ కోటాలో (NIIs and QIB quota) మరింత సబ్ స్క్రిప్షన్ పెరుగనుంది. అర్బన్ కంపెనీ ఐపీవోకు (urban company IPO) ఫుల్ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో లిస్టింగ్ గెయిన్స్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నెల 15న షేర్ల కేటాయింపు పూర్తి కానుండగా, 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ కంపెనీ ఇది లిస్టింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గ్రే మార్కెట్ లో భారీగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఆరంభ లాభాలు దండిగానే వస్తాయన్న నమ్మకం కనిపిస్తోంది.

    More like this

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....

    Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమా. .! పోలీస్‌ రాజ్యమా..?

    అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్‌ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌...

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...