Homeబిజినెస్​Urban Company IPO | ఐపీవోకు అర్బన్‌ కంపెనీ.. బుధవారంనుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

Urban Company IPO | ఐపీవోకు అర్బన్‌ కంపెనీ.. బుధవారంనుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urban Company IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. మొబైల్‌ యాప్‌ ఆధారిత బ్యూటీ, హోమ్‌ సర్వీసెస్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన అర్బన్‌ కంపెనీ ఈ వారంలో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. లిస్టింగ్‌ గెయిన్స్‌(Listing gains) అందించే అవకాశాలున్న ఈ కంపెనీ ఐపీవో వివరాలు తెలుసుకుందామా..

అర్బన్‌ కంపెనీ(Urban Company) వివిధ గృహ మరియు సౌందర్య విభాగాలలో ఆన్‌లైన్‌ ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తోంది. క్లీనింగ్‌, పెస్ట్‌ కంట్రోల్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌, కార్పెంటరీ, ఉపకరణాల సర్వీసింగ్‌, మరమ్మతు, ఆన్‌ డిమాండ్‌ హోమ్‌ హెల్ప్‌(On demand Home help) సహాయం, పెయింటింగ్‌, స్కిన్‌కేర్‌, హెయిర్‌ గ్రూమింగ్‌, మసాజ్‌ థెరపీ వంటి సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులో ఉంచుతోంది. దీని సేవలు భారత్‌తోపాటు సింగపూర్‌, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలలో అందుబాటులో ఉన్నాయి.

ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 1,900 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో ఫ్రెష్‌ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 472 కోట్లు సమీకరించనుండగా.. మిగిలినది ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) ద్వారా సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన నిధులను కొత్త టెక్నాలజీ అభివృద్ధి, క్లౌడ్‌ మౌలిక సదుపాయాల కోసం, కార్యాలయాల లీజు చెల్లింపులకు, మార్కెటింగ్‌ కార్యకలాపాలకు, ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.

కంపెనీ పనితీరు : 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 927.99 కోట్ల ఆదాయాన్ని(Revenue) ఆర్జించిన కంపెనీ.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,260.68 కోట్లు సంపాదించింది. 2024లో రూ. 92.77 కోట్ల నష్టాన్ని చవిచూసిన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 239.77 కోట్ల లాభాలను(Net profit) ఆర్జించింది. ఇదే కాలంలో కంపెనీ ఆస్తులు(Assets) రూ. 1,638 కోట్లనుంచి రూ. 2,200 కోట్లకు పెరిగాయి.

ధరల శ్రేణి : ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 98 నుంచి రూ. 103గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 145 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌బాండ్‌(Price band) వద్ద రూ. 14,935 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు : అర్బన్‌ కంపెనీ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ ఈనెల 10న ప్రారంభమవుతుంది. బిడ్డింగ్‌కు 12 వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్‌ విండో మంగళవారం అందుబాటులో ఉండనుంది. 15వ తేదీ రాత్రి అలాట్‌మెంట్‌ స్టేటస్‌ తెలిసే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 17న బీఎస్‌ఈ(BSE), ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

కోటా, జీఎంపీ : క్యూఐబీ(QIB)లకు 75 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను కేటాయించారు. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 28 ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ రోజు 27 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.