HomeUncategorizedUPSC | నిరుద్యోగుల‌కు యూపీఎస్సీ శుభ‌వార్త.. వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

UPSC | నిరుద్యోగుల‌కు యూపీఎస్సీ శుభ‌వార్త.. వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: UPSC | నిరుద్యోగుల‌కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) శుభ‌వార్త చెప్పింది. 2025 సంవత్సరానికి 84 లెక్చరర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsconline.gov.in లో ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 11, 2025.

UPSC | మంచి వేత‌నం..

లెక్చరర్ పదవికి (Lecturer Post) కనీసం రూ. 52,700 నుండి రూ. 1,66,700 వరకు వేత‌నం చెల్లిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (Assistant Public Prosecutor) జీతం రూ. 56,100-1,77,500 మరియు రూ. 44,900-1,42,400 వరకు ఉంటుంది. ఇక‌, బోటనీ, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, హోమ్ సైన్స్, ఫిజిక్స్, సైకాలజీ, సోషియాలజీ, జువాలజీ త‌దిత‌ర విభాగాల్లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. CBI- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో పనిచేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియ‌మించ‌నున్నారు.

UPSC | ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

UPSC లెక్చరర్, అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ పోస్టులు (Assistant Prosecutor posts) ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి “ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్” లింక్‌పై క్లిక్ చేయండి. తర్వాత, మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ ఖాళీ పక్కన ఉన్న “ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి” బటన్‌పై క్లిక్ చేయండి. నెక్ట్స్ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి, ఆపై కంటిన్యూ బ‌ట‌న్ నొక్కండి. తొలి రిజిస్టర్ చేసుకుంటుంటే “కొత్త రిజిస్ట్రేషన్”పై (New Registration) క్లిక్ చేయండి. పేరు, తండ్రి పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. “సేవ్ చేసి కొనసాగించు”పై క్లిక్ చేయండి, అప్పుడు మీరు పోస్ట్ కోసం విజయవంతంగా నమోదు చేసుకుంటారు.

UPSC | ఖాళీల వివ‌రాలు..

మొత్తం 84 పోస్టులలో, 19 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోసం, 25 పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోసం ఆహ్వానించబడ్డాయి. లెక్చరర్‌గా వృక్షశాస్త్రం 8, రసాయన శాస్త్రంలో 8 పోస్టులు, ఆర్థిక శాస్త్రంలో 2 , చరిత్రలో 3, హోం సైన్స్‌లో 1 , భౌతిక శాస్త్రంలో 6, సైకాలజీలో 1, సోషియాలజీలో 3, జంతుశాస్త్రంలో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

UPSC | అర్హులు ఎవ‌రంటే..

లెక్చరర్ పోస్టుకు సంబంధిత విభాగాల్లో (బొటానికల్, ఫిజిక్స్ మొదలైనవి) పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని (Post Graduation Degree) కలిగి ఉండాలి. బ్యాచిలర్ ఎడ్యుకేష‌న్ ( B.Ed.) కలిగి ఉండాలి. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అనర్హులు కానీ రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం వ‌య‌స్సు సడలింపు ఉంటుంది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయ‌శాస్త్రంలో డిగ్రీని కలిగి ఉండాలి. క్రిమినల్ కేసులు నిర్వహించడంలో బార్‌లో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ పోస్టులకు అనుభవం అవసరం లేదు. 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రకు ఎంపికైన వారు ఢిల్లీలోని CBI ప్రధాన కార్యాలయంలో (CBI headquarters) పని చేయాల్సి ఉంటుంది. అలాగే, ఎక్కడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. లెక్చరర్ పోస్టులు లడఖ్ ప్రాంతానికి మాత్రమే కేటాయించారు.