HomeUncategorizedUPI Charges | యూపీఐ యూజర్లకు అలర్ట్.. లావాదేవీలపై త్వరలో బాదుడే!

UPI Charges | యూపీఐ యూజర్లకు అలర్ట్.. లావాదేవీలపై త్వరలో బాదుడే!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI Charges : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యూజర్లు ఇకపై అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇకపై యూపీఐ ఉచిత లావాదేవీల వెసులుబాటు కనుమరుగు కాబోతోంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) Reserve Bank of India (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం Governor Sanjay Malhotra వివరాలు వెల్లడించారు.

యూపీఐ వ్యవస్థను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మల్హోత్రా అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకులు, థర్డ్ పార్టీ కంపెనీల యూపీఐ యాప్‌‌లకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తూ.. వాటి లావాదేవీల బిల్లులను సర్కారు భరిస్తోందని మల్హోత్రా వెల్లడించారు.

UPI Charges | విశ్వజనీన చెల్లింపు సాధనంగా..

నగదు, చెల్లింపులు అనేవి ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటివని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. యూపీఐ వ్యవస్థను భవిష్యత్తులో విశ్వజనీన చెల్లింపు సాధనంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీల విషయంలో కస్టమర్లు కొన్ని ఛార్జీలను తప్పకుండా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

UPI Charges | బాదుడు తప్పదా..

కొవిడ్​ తర్వాత యూపీఐ లావాదేవీలను కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తోంది. కాగా, గత రెండేళ్లలో ఈ లావాదేవీలు రెట్టింపు స్థాయిలో కొనసాగుతున్నాయి. రెండేళ్లకు ముందు నిత్యం రూ. 31 కోట్ల లావాదేవీలు ఉండేవి. ఆ తర్వాత రూ.60 కోట్లు దాటడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలు దేశ వ్యాప్త చర్చకు దారి తీశాయి. యూపీఐ యాప్‌లను ప్రస్తుతం బ్యాంకులతో పాటు గూగుల్ పే, ఫోన్ పే లాంటి పలు థర్డ్ పార్టీ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నాయి. వీటి లావాదేవీలపై కంపెనీలు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు.

ఇలా ఉచిత యూపీఐ సర్వీసుల వల్ల గిట్టుబాటు కావడం లేదనేది కంపెనీల వాదన. ఛార్జీల విధానం కావాలని ఆర్​బీఐని గతంలో పలుమార్లు కోరాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ తాజా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే.. కొద్ది రోజుల్లోనే ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

Must Read
Related News