అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Old City Metro | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మెట్రో విస్తరణకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక చొరవ చూపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో కీలక పురోగతి చోటు చేసుకుంది.
పాత బస్తీలో మెట్రో విస్తరణ పనులకు గతంలోనే ప్రభుత్వం ఆమోదించింది. నగరంలోని ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్ గుట్ట (MGBS-Chandrayaan Gutta ) వరకు మెట్రో విస్తరణ కోసం ఆస్తులను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెట్రో కారిడార్ (Metro Corridor) మార్గంలో ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ పనులు కారిడార్ నిర్మాణం ప్రారంభించడానికి అవసరమైన రైట్ ఆఫ్ వే లభించే కీలక దశకు చేరుకున్నాయని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Old City Metro | వేగంగా పనులు
మొత్తం ఏడున్నర కిలోమీటర్ల కారిడార్‌లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపడుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి (Metro MD NVS Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు విస్తరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా మెట్రో రైలు పట్టాలెక్కించడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Old City Metro | మెట్రో పనుల వివరాలు
ఓల్డ్ సిటీలో 7.5 కి.మీ కారిడార్ నిర్మించనున్నారు. రెండేళ్లలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్మార్ట్ రీడిజైన్ ద్వారా ప్రభావిత ఆస్తులను 1,100 నుండి 886 కు తగ్గించనున్నారు. ఇప్పటికే 550కి పైగా భవనాలను కూల్చివేశారు. బాధితులకు రూ.433 కోట్ల పరిహారం చెల్లించారు. త్వరలో కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం DGPS & డ్రోన్ సర్వేలను నిర్వహిస్తున్నారు. భూగర్భ యుటిలిటీలను మ్యాప్ చేయడానికి GPR సర్వే, నేల, లోడ్ పరీక్షలు చేపడుతున్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.