అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ram Charan- Upasana | మెగాస్టార్ Chiranjeevi కుటుంబంలో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన (Ram Charan- Upasana) దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి సందడి మధ్య జరిగిన సీమంతం వేడుక ఫ్యాన్స్‌లో ఆనందం నింపింది.
ఉపాసన తాజాగా తన సోషల్ మీడియాలో ఒక అందమైన వీడియో షేర్ చేస్తూ.. Double love, double blessings, double celebrations అని క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ సంతోషంగా కనిపించారు. అలానే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉపాసనని ఆశీర్వాదించారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా (Social Media) అంతా ‘మెగా ఫ్యామిలీ డబుల్ జాయ్’ అంటూ పోస్టులతో నిండిపోయింది.
Ram Charan- Upasana | గుడ్ న్యూస్..
2023 జూన్‌లో రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పాప క్లీంకార కొణిదెల (Klinkara Konidela) జన్మించింది. ఇప్పుడు రెండేళ్లలోపే రెండో బేబీ రాబోతుందన్న వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. “సింబా వస్తున్నాడు!” అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు (Mega Fans) సంబరాలు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఉపాసన గర్భవతిగా ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోతో ఆ రూమర్స్‌కు ఆమె స్వయంగా బ్రేక్ పెట్టింది. ఇప్పుడు అధికారికంగా మెగా కుటుంబంలో మరో బేబీ రాబోతుందన్న విషయం స్పష్టమైంది. ఈ సారి కొడుకే పుడతాడు అని మెగా ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న “పెద్ది” సినిమా (Peddi Movie) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో చరణ్ పక్కా ఊర మాస్ లుక్‌లో అలరించబోతున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి, చరణ్ కెరీర్‌లో “పెద్ది” పెద్ద సక్సెస్‌గా నిలవబోతుందనే ఆసక్తి ఉన్న నేపథ్యంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఈ జంటకు మరో మధురమైన అనుభూతి దక్కనుంది.

