అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “నా భార్య రాత్రి పాముగా మారుతోంది. నన్ను కాటు వేయాలని చూస్తోంది” అంటూ ఓ భర్త చేసిన వింత ఆరోపణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారుతోంది. సీతాపూర్ జిల్లా (Sitapur District) మహమూదాబాద్ తాలూకాలోని లోధ్సా గ్రామానికి చెందిన మెరాజ్ అనే వ్యక్తి తాజాగా జరిగిన సమాధాన్ దివస్ (ప్రజావాణి) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను (District Collector) వ్యక్తిగతంగా కలిసి ఓ షాకింగ్ ఫిర్యాదు చేశాడు. సార్, నా భార్య నసీమున్ రాత్రికి రాత్రే పాముగా మారుతోంది. నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది! అని మెరాజ్ వాపోయాడు.
Uttar Pradesh | ఇదెక్కడి విచిత్రం..
మెరాజ్ తెలిపిన వివరాలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. నా భార్య రాత్రిపూట విచిత్రంగా ప్రవర్తిస్తుంది. పాములా (Snake) మారుతుంది. తనను చంపేందుకు పలుమార్లు ప్రయత్నించిందని పేర్కొన్నాడు. చివరకు, “ఏదో ఒక రాత్రి నన్ను చంపేస్తుందన్న భయం నన్ను భయపడుతోంది” అని మెరాజ్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఇది విని షాక్‌లోకి వెళ్లిన జిల్లా మేజిస్ట్రేట్ వెంటనే ఎస్డీఎం, పోలీసులకు విచారించాలని ఆదేశించారు. ప్రాథమికంగా దీన్ని మానసిక వేధింపుల కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ వింత ఫిర్యాదు గురించిన వార్త బయటకు రాగా, ఇది క్షణాలలో ‘X’ (Twitter) లో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు ఇది నాగిన కథా? లేక శ్రీదేవి రీ ఎంట్రీనా?, భార్య పామైతే.. భర్త నాగేంద్రుడు అయిపోయాడు కదా!, మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన కలిగించాల్సిన సమయం , కచ్చితంగా నాగమణి కోసం ఈ భార్య తిరుగుతుంటుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ ఫిర్యాదుతో ఈ కేసులో నిజమెంత, ఇది కేవలం ఊహాత్మకమా అన్న కోణాల్లో స్థానిక పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.