- Advertisement -
HomeUncategorizedThermal Plants | థర్మ‌ల్‌ విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రంగా యూపీ.. 9,940 మెగావాట్ల ఉత్పత్తి చేసేలా...

Thermal Plants | థర్మ‌ల్‌ విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రంగా యూపీ.. 9,940 మెగావాట్ల ఉత్పత్తి చేసేలా ఐదు కొత్త ప్లాంట్లు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Thermal Plants | భారీ థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్(Uttar Pradesh) నిలువ‌నుంది. రూ.44 వేల కోట్ల వ్య‌యంతో మొత్తం 9,940 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను నిర్మించేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

రాష్ట్రంలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఈ భారీ ప్రాజెక్టుకు యూపీ స‌ర్కారు ఆమోదం తెలిపింది. ఒకేరోజు ఐదు థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల (Thermal Power Projects) నిర్మాణానికి తొలి అడుగు ప‌డింది. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం వీటి నిర్మాణాన్ని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. కాన్పూర్‌లో రూ.47,573 కోట్లకు పైగా విలువైన 15 మెగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

- Advertisement -

Thermal Plants | రూ.44 వేల కోట్లు.. 9,940 మెగావాట్లు..

రాష్ట్రంలో విద్యుత్ కొర‌త‌ను తీర్చేందుకు యోగీ స‌ర్కారు భారీగా విద్యుత్ ఉత్ప‌త్తి(Power Generation)పై దృష్టి కేంద్రీక‌రించింది. ఈ నేప‌థ్యంలో థర్మ‌ల్ పవ‌ర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. మొత్తం రూ.44 వేల కోట్ల వ్య‌యంతో 9,940 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసేందుకు గాను ఐదు ప‌వ‌ర్ ప్లాంట్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించింది.

జవహర్‌పూర్ (ఎటా)లో రూ.14,628 కోట్లతో రెండు 660 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని నిర్మించ‌నున్నారు. రూ.6,502 కోట్లతో సోన‌భ‌ద్ర‌లో రెండు 660 మెగావాట్ల ప్లాంట్లు, రూ. 5,544 కోట్లతో ఖుర్జా (బులంద్‌షహర్) లో రెండు 660 మెగావాట్ల ప్లాంట్ల‌తో పాటు ఘతంపూర్ (కాన్పూర్)లో 9,300 కోట్లలో 660 మెగావాట్ల ప్లాంట్, పంకి (కాన్పూర్)లో 8,300 కోట్ల వ్య‌యంతో 660 మెగావాట్లు ఉత్ప‌త్తి చేసే ప్లాంట్‌ను నిర్మించ‌నున్నారు. ఇందులో 4,000 మెగావాట్ల UMPPతో సహా ఐదు ప్లాంట్లను ప్రైవేట్ రంగ స‌హ‌కారంతో నిర్మించ‌నున్నారు.

ఆయా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి మోదీ(PM Modi) శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న చేశారు. అలాగే, కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగ‌మైన‌ చున్నిగంజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ వరకు కొత్త భూగర్భ విభాగాన్ని ప్రారంభించారు. బింగవాన్‌లోని 40 MLD శుద్ధి కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News