అక్షరటుడే, వెబ్‌డెస్క్: Unwanted hair | ముఖంపై అన్‌వాంటెడ్ హెయిర్ (అవాంఛిత రోమాలు) అనేది చాలా మంది మహిళలకు ఒక పెద్ద సమస్య. దీనివల్ల ముఖం కాంతివిహీనంగా కనిపించడమే కాకుండా, ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. సాధారణంగా వీటిని తొలగించుకోవడానికి వ్యాక్సింగ్, థ్రెడింగ్ లేదా ఖరీదైన లేజర్ ట్రీట్‌మెంట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఈ పద్ధతులు అందరికీ సౌకర్యంగా ఉండవు, పైగా నొప్పిని కలిగిస్తాయి. వీటికి బదులుగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజసిద్ధమైన చిట్కాలతో ఇంట్లోనే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
Unwanted hair | యాంటీ ఆండ్రోజెన్ టీ (Anti-Androgen Tea)
శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగినప్పుడు ముఖంపై వెంట్రుకలు వస్తాయి. యాంటీ ఆండ్రోజెన్ టీ Anti-androgen tea ఆ హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కావలసినవి: 1 స్పూన్ మెంతులు, చిటికెడు దాల్చిన చెక్క, ఒక స్పియర్‌మింట్ టీ బ్యాగ్ (పుదీనా జాతికి చెందినది).
తయారీ విధానం: ఒక గ్లాసు నీటిలో మెంతులు, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో స్పియర్‌మింట్ టీ బ్యాగ్‌ను కొద్దిసేపు ఉంచి, వడకట్టి తాగాలి.
ప్రయోజనం: మెంతులు, స్పియర్‌మింట్ శరీరంలోని ఆండ్రోజెన్ స్థాయిలను తగ్గించి, సహజంగానే రోమాల పెరుగుదలను నియంత్రిస్తాయి.
Unwanted hair | స్పియర్‌మింట్ ఆయిల్ మాయిశ్చరైజర్:
బయట దొరికే కెమికల్ క్రీములకు బదులుగా, స్పియర్‌మింట్ ఆయిల్‌ను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
విధానం: రోజూ వాడే మాయిశ్చరైజర్‌లో రెండు చుక్కల స్పియర్‌మింట్ ఆయిల్ కలిపి, రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయాలి. ఇది రోమ రంధ్రాలను బలహీనపరిచి, వెంట్రుకలు రాలిపోయేలా చేస్తుంది.
సహజ పద్ధతులు:
టీ, ఆయిల్‌తో పాటు పసుపు ముద్దను ముఖానికి పట్టించడం లేదా ఓట్స్, అరటిపండు మిశ్రమంతో స్క్రబ్ చేయడం వల్ల కూడా అన్‌వాంటెడ్ హెయిర్ క్రమంగా తగ్గుతుంది. ఈ చిట్కాలను ఓపికతో క్రమం తప్పకుండా పాటిస్తే, పార్లర్‌కు వెళ్లే అవసరం లేకుండానే మీ ముఖం కోమలంగా, అందంగా మారుతుంది.
