అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Australia | ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల(Indian Students)పై జాత్యహంకార దాడులు ఆగడం లేదు. చదువు, ఉద్యోగం కోసం అక్కడ వెళ్లిన భారతీయులపై కొందరు దాడులకు తెగబడుతున్నారు. ఉన్నత చదువుల కోసం ఎంతో మంది భారతీయులు ఆస్ట్రేలియా(Australia) వెళ్తారు. అయితే విద్యార్థులపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అడిలైడ్‌లో భారతీయ విద్యార్థిపై దాడి జరగ్గా తాజాగా మెల్బోర్న్(Melbourne)లో మరో ఘటన చోటు చేసుకుంది.
Australia | తుపాకులు, కత్తులతో దాడి
ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దుండగులు దాడి చేశారు. మెల్బోర్న్లోని షాపింగ్ సెంటర్ బయట సౌరభ్ ఆనంద్ అనే భారతీయ విద్యార్థిపై తుపాకులు, కత్తులతో ఐదుగురు యువకులు దాడి చేశారు. దీంతో సౌరభ్ వెన్నెముక, భుజం విరిగిపోయాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.
Australia | ఆందోళనలో తల్లిదండ్రులు
ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చదువు కోసం తమ పిల్లలను ఆ దేశానికి పంపిన తల్లిదండ్రులు కలవర పడుతున్నారు. ఇటీవల ఓ భారతీయ పౌరుడిని మోకాలితో తొక్కిపెట్టి చంపిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అడిలైడ్‌లో పార్కింగ్ వివాదంలో చరణ్‌ప్రీత్ సింగ్ అనే భారతీయ విద్యార్థిపై జులై 19 కొందరు దాడి చేశారు. వెళ్లిపో.. ఇండియన్ అంటూ దుండగులు తనపై దాడి చేశారని చరణ్‌సింగ్ పేర్కొన్నారు. తాజాగా సౌరభ్‌పై దాడి జరిగింది. ఇలాంటి దాడులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం(Australian Government) సీరియస్ అయినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం(India Government) స్పందించి దాడులు జరపకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చలు జరపాలని భారతీయ విద్యార్థులు కోరుతున్నారు.