అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet Expansion | మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampalli Satyanarayana) దంపతులు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి అనురాధ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని తొక్కేశామని కొందరు సంతోష పడుతున్నారు. కవ్వంపల్లి (Kavvampalli) ఎంత తొక్కితే అంత ఎదుగుతారు” అని వ్యాఖ్యానించారు. “రాష్ట్ర స్థాయిలో తన సేవలు అవసరం లేదని ఆ దేవుడు అనుకున్నాడేమో” అని సత్యనారాయణ అన్నారు.
రాష్ట్రంలో ఇటీవల మూడు మంత్రి పదవులను (ministerial posts) భర్తీ చేసిన విషయం తెలిసిందే. పదవుల భర్తీకి ముందు కేబినెట్లో (Cabinet) తమకు అవకాశం కల్పించాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సీఎంతో పాటు అధిష్టానాన్ని కలిసి విన్నవించారు. ఈ మేరకు మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు (Adluri Laxman Kumar) మంత్రి పదవి కేటాయించారు. అయితే ముందు కవ్వంపల్లి సత్యనారాయణకు (Kavvampalli Satyanarayana) మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వచ్చాయి. తీరా లక్ష్మణ్‌కుమార్‌కు మినిస్టర్ పోస్ట్ ఇవ్వడంతో కవ్వంపల్లి దంపతులు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మంత్రి పదవి ఆశించి భంగపడ్డవారు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని (MLA Malreddy Ranga Reddy) పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రి శ్రీధర్‌భాబు బుజ్జగించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి (Bodhan MLA Sudarshan Reddy) మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మంగళవారం నియోజకవర్గంలో నిరసనలు తెలిపారు.