Homeజిల్లాలుకామారెడ్డిRain Effect | అకాల వర్షం.. అన్నదాతకు కష్టం..

Rain Effect | అకాల వర్షం.. అన్నదాతకు కష్టం..

వర్షాలు అన్నదాతలను అగం చేస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. బాన్సువాడ, ఆర్మూర్​, పెద్దకొడప్​గల్​లో రెండురోజులుగా వర్షం కురుస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : Rain Effect | ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టం మిగులుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు తడిసి రైతుల కష్టాలు మరింత పెరిగాయి. బాన్సువాడ (Banswada) నియోజకవర్గంలో సోమ, మంగళవారాల్లో కురిసిన అకాల వర్షం వల్ల రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.

Rain Effect | బీర్కూరు మండలంలో..

బీర్కూరు మండలం (Birkur Mandal) బరంగెడ్గి శివారు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షం నీటిలో తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఆగిన వెంటనే ధాన్యం మళ్లీ ఆరబెట్టేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షంతో నీటిపాలవుతుందేమోననే భయంతో రైతులు (Farmers) రాత్రింబవళ్లు జాగరణ చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు.

Rain Effect | ఆర్మూర్​లో..

అక్షరటుడే ఆర్మూర్: ఆర్మూర్ (Armoor) ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం తేలికపాటి వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు ఆరబెట్టిన ధాన్యంపై కవర్లు కప్పినప్పటికీ ఒకసారిగా భారీవర్షం (Heavy Rain) కురవడంతో ధాన్యంలోకి నీరు చేరడంతో కొంతమేర తడిసింది. దీంతో రైతులు తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో పడ్డారు.