Homeజిల్లాలునిజామాబాద్​Irrigation Projects | శ్రీరాంసాగర్​, నిజాంసాగర్​లకు కొనసాగుతున్న వరద

Irrigation Projects | శ్రీరాంసాగర్​, నిజాంసాగర్​లకు కొనసాగుతున్న వరద

శ్రీరాంసాగర్​,నిజాంసాగర్​ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి​: Irrigation projects | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

Irrigation projects | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులో..

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు (Sriram Sagar Project) వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు గురువారం 4 వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ప్రస్తుతం 21,954 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ఎస్కేప్​ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 650 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. కాకతీయ (Kakatiya Canal), లక్ష్మి కాలువకు నీటిని నిలిపేశారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్​ఫ్లో, ఔట్​ఫ్లో గురువారం సమానంగా ఉంది. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.

Irrigation projects | నిజాంసాగర్​లో..

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్​ఫ్లో క్రమం తప్పకుండా వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 9,570 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 12 గేట్లకు గాను 2 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో జలాశయంలో నీటినిల్వ ఉంది.