3
అక్షరటుడే, ఆర్మూర్ : School Seized | పట్టణంలోని వేంకటేశ్వర కాలనీలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హ్యాపీ కిడ్స్ పాఠశాలను ఎంఈవో రాజగంగారాం (MEO Rajagangaram) శుక్రవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరు పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేదని, విద్యార్థులను పాఠశాలలో చేర్పించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ అనుమతి ఉన్న పాఠశాలల్లోనే అడ్మిషన్లు చేయాలన్నారు.