Homeజిల్లాలునిజామాబాద్​Degree Admissions | డిగ్రీ అడ్మిషన్లకు అపూర్వ స్పందన

Degree Admissions | డిగ్రీ అడ్మిషన్లకు అపూర్వ స్పందన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Degree Admissions | నిజామాబాద్​ (Nizamabad)లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు ఈ విద్యా సంవత్సరంలో అపూర్వ స్పందన లభించిందని ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్ తెలిపారు.

లైఫ్ సెన్సెస్ (Life Sciences), బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (Business Administrative) విభాగాల్లో 140 సీట్లలో గిరిజన బాలికలు పోటీపడి మరీ అడ్మిషన్లు పొందారన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో అడ్మిషన్ల ప్రక్రియ సాగడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేసవి సెలవుల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహించి అడ్మిషన్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారన్నారు. ఫిజికల్ సైన్స్ (Physical Science) విభాగాల్లో ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 26 లోపు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, రిజిస్ట్రేషన్ రుసుము తీసుకుని వస్తే వెంటనే అడ్మిషన్ కల్పిస్తామన్నారు.