HomeUncategorizedPakistan Embassy | బుద్ధి మార‌ని పాక్‌..భార‌త దౌత్య‌సిబ్బంది బ‌హిష్క‌ర‌ణ‌

Pakistan Embassy | బుద్ధి మార‌ని పాక్‌..భార‌త దౌత్య‌సిబ్బంది బ‌హిష్క‌ర‌ణ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Pakistan Embassy | భార‌త్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్(Pakistan) బుద్ధి మార‌లేదు. ఇండియాలో ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తునిస్తున్న ఆ దేశ హైక‌మిష‌న్ సిబ్బంది(Pakistan High Commission staff)ని భార‌త్ బ‌హిష్క‌రిస్తే, పాకిస్తాన్ కూడా అదే బాట ప‌ట్టింది. పరస్పర దౌత్య చర్యలో భాగంగా , పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బంది(Indian High Commission Staff)ని బహిష్కరిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. స‌ద‌రు వ్యక్తిని ‘పర్సనా నాన్ గ్రాటా’గా ప్రకటించి 24 గంటల్లోపు అతనిని వెళ్లిపోవాలని ఆదేశించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దౌత్య హోదాకు విరుద్ధంగా కార్యకలాపాలలో పాల్గొన్నందుకు పాకిస్తాన్ దౌత్యవేత్తను న్యూఢిల్లీలోని తన హైకమిషన్ నుండి భారతదేశం(India) బహిష్కరించిన తర్వాత ఈ చర్య తీసుకుంది.

“ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బంది తన ప్రత్యేక హోదాకు విరుద్ధంగా కార్యకలాపాలలో పాల్గొన్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటా(Persona non grata)గా ప్రకటించింది. సంబంధిత అధికారిని 24 గంటల్లోపు పాకిస్తాన్ విడిచి వెళ్లాలని ఆదేశించింది” అని పాక్ విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. ఈ నిర్ణయాన్ని తెలియజేయడానికి భారత చార్జి డి’అఫైర్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించారు.