అక్షరటుడే, బాన్సువాడ : Desaipet | అప్పుడే పుట్టిన నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చెత్తకుప్పలో పడేశారు. ఈ సంఘటన బాన్సువాడ మండలం (Banswada Mandal) దేశాయిపేట గ్రామంలో కలకలం రేపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని చెత్తకుండీ వద్ద కాలిన గాయాలతో ఉన్న శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శిశువు పూర్తిగా కాలిపోయి ఉండడాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎందుకు ఇలా చేశారని చర్చించుకుంటున్నారు.
Desaipet | ఎక్కడి నుంచి తీసుకొచ్చి..
నవమాసాలు మోసి కన్న శిశువును ఇలా అమానుషంగా హతమార్చడంపై మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడో కని హతమార్చిన అనంతరం గ్రామంలో తీసుకొచ్చి వేసినట్లు గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటనతో దేశాయిపేట గ్రామంలో (Desaipet village) విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న సీఐ తుల శ్రీధర్ (SI Tula Sridhar) సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని పేర్కొన్నారు.