HomeతెలంగాణRangareddy District | 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల యువ‌కుడు.. ద‌ర్యాప్తు...

Rangareddy District | 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల యువ‌కుడు.. ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Rangareddy District | ఈ రోజుల్లో కామాంధులు ఘోరాల‌కి పాల్ప‌డుతున్నారు. అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌తో పాటు పండు ముస‌లివారిపై కూడా అత్యాచారం జ‌రుపుతున్నారు. ఈ మ‌ధ్య ఆడది కనిపిస్తే చాలు మృగల్లా చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా కామా పిశాచుల్లా ప్రవర్తిస్తున్నారు.తాజాగా తెలంగాణ Telanganaలో ఘోరమైన ఘటన జరిగింది. సీఐ నందీశ్వర్ రెడ్డి కథనం ప్రకారం.. యాచారం మండల పరిధిలోని మంతన్ గౌరెల్లి గ్రామం(Manthan Gourelli Village)లో 90 ఏళ్ల ఓ వృద్ధురాలు బుధవారం అర్ధరాత్రి తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు.

Rangareddy District | ఇదెక్క‌డి పైశాచికం..

మద్యం మత్తులో ఆమెపై దాడికి ఒడిగట్టారు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం తెల్లవారుజామున చుట్టుపక్కల వారు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ Gandhiఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల్లో ఒకడికి గడ్డం, మీసాలు ఉన్నాయని.. తెల్లటి టీషర్టు ధరించాడని బాధితురాలు చెప్పింది. గ్రామానికి క్లూస్‌టీం, పోలీసు జాగిలాలతో దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సూచించారు. సీసీ కెమెరాలు ఉండి ఉంటే దుండగులు పట్టుకోవడం తేలికయ్యేదని ఏసీపీ చెప్పారు.

వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు(Police) బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను గ్రామస్తులు కోరారు. అయితే అత్యాచారం చేస్తున్న‌ స‌మయంలో వృద్ధురాలు ఏమీ చేయలేక గజగజలాడిపోయింది. ఆమె అరుపులు పెదవి దాటలేకపోయాయి. ప్రతిఘటించే సత్తువ కూడా ముసలవ్వలో లేకపోవడంతో ఆ యువకుడు అత్యాచారం Rape చేసి పరారయ్యాడు. ఆమె మాత్రం స్పృహతప్పి రాత్రంతా అక్కడే పడిపోయింది. ఉదయం వచ్చిన పనిమనిషి రక్తపుమడుగులో పడి ఉన్న ఆ వృద్ధురాలిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించడంతో అంతా అక్కడకు చేరుకున్నారు.