అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఈనెల 18న యూనిటీ మార్చ్ (Unity March) నిర్వహించనున్నట్లు మై భారత్ కో–ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు.
ఉదయం 9 గంటలకు నగరంలోని వర్ని చౌరస్తాలో గల సర్దార్ పటేల్ చౌక్ (Sardar Patel Chowk) నుంచి ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, కోర్టు సర్కిల్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
