Homeజిల్లాలునిజామాబాద్​Unity March | జిల్లాలో 31వ తేదీ నుంచి ‘యూనిటీ మార్చ్’: ఎంపీ అర్వింద్​

Unity March | జిల్లాలో 31వ తేదీ నుంచి ‘యూనిటీ మార్చ్’: ఎంపీ అర్వింద్​

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఎంపీ అర్వింద్​ కోరారు. నగంరంలో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఆయన మంగళవారం మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Unity March | భారత యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జిల్లాలో యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Unity March | దేశాభివృద్ధిలో పటేల్​ కీలకపాత్ర..

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పటేల్ దేశాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రధానంగా దేశంలోని 500కు పైగా సంస్థానాలను విలీనం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. అయితే హైదరాబాద్ (Hyderabad) మాత్రం విలీనం కాలేదని దీంతో ‘ఆపరేషన్ పోలో’కు నడుం బిగించారని గుర్తు చేశారు. ఐదు రోజుల పోరాటంలో నిజాం లొంగిపోయాడన్నారు.

Unity March | జిల్లాలో పాదయాత్ర..

జిల్లాస్థాయి పాదయాత్ర అక్టోబర్ 31న ప్రారంభమవుతుందని ‘మై భారత్’ కేంద్రం కో–ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. అలాగే మై భారత్ పోర్టల్​లో (My Bharat portal) అనేక అంశాలపై వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన వారికి నవంబర్ 26 నుంచి జరిగే జాతీయస్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.