అక్షరటుడే, వెబ్డెస్క్ : Minister Rammohan Naidu dance | కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) తన సొంత జిల్లా శ్రీకాకుళంలో జరిగిన బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొని ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. వేదికపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి రామ్మోహన్ నాయుడు కాలు కదిపిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతున్నాయి. ఆయన హుందాగా నవ్వుతూ, చలాకీగా స్టెప్పులు వేస్తూ చేసిన డ్యాన్స్ అక్కడున్న వారినే కాదు, నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది.
Minister Rammohan Naidu dance | ఉత్సాహంగా డ్యాన్స్…
ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియాలో (social media platforms) ఈ వీడియోలు పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పటికీ ఇలా ప్రజల్లో కలిసిపోతూ, సందడిగా పాల్గొనడంపై యువత ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి (TDP Party) చెందిన యువ నేతగా రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా (Minister of Civil Aviation) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ తరహా వినోదాత్మక చిత్రాలను ఆదరిస్తూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా (Srikakulam district) నిమ్మాడలో 1987 డిసెంబరు 18న రామ్మోహన్ నాయుడు.. విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు దంపతులకి జన్మించాడు. రామ్మోహన్ నాయుడికి ఆదిరెడ్డి భవానీ అనే సోదరి కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమె రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది.
రామ్మోహన్ నాయుడు ఒకటి నుంచి మూడో తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్‌లో ఉండి చదువుకున్నారు. ఎర్రనాయుడు హఠాన్మరణంతో.. ఆయన కుమారుడైన రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రతిభ చాటుకున్నాడు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు తనదైన వాక్పటిమతో తండ్రికి తగ్గ తనయుడు అని ప్రశంసలు దక్కించుకున్నాడు.. 2014 నుంచి శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్న రామ్మోహన్.. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో (Srikakulam district politics) తనదైన ముద్ర వేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు.
స్టేజీపై డాన్స్ అదరగొట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళంలో జరిగిన తన బంధువుల వివాహ వేడుకలో యువకులతో కలిసి గ్యాంగ్ లీడర్ పాటకు స్టెప్పులు వేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు pic.twitter.com/2gQTITtids
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025