అక్షరటుడే, కామారెడ్డి : Union Minister Bandi Sanjay : ఎల్లారెడ్డి Yellareddy నియోజకవర్గంలో వరద బాధితులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Bandi Sanjay తెలిపారు.
కామారెడ్డి Kamareddy జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ఘటనలపై మంత్రి స్పందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో హెలికాప్టర్ సహాయం కావాలని కోరుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ NDRF ను కూడా అలర్ట్ చేశామని కేంద్ర మంత్రి తెలిపారు.
Union Minister Bandi Sanjay : స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు.