ePaper
More
    HomeతెలంగాణAmit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) రానున్న నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

    పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. కంఠేశ్వర్​ బైపాస్ (Kanteshwar Bypass)​ వద్ద డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    Amit Shah | పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి

    నిజామాబాద్​ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. ఇప్పటికే బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ భవానీశ్రీని నియమించిన విషయం తెలిసిందే.

    Amit Shah | డీఎస్​ విగ్రహావిష్కరణ

    పసపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ విగ్రహాన్ని అమిత్​ షా ఆవిష్కరించనున్నారు. ఈ కాంస్య విగ్రహాన్ని డీఎస్​ తనయుడు, ఎంపీ అర్వింద్​ రూ. 40 లక్షలు వెచ్చించి తయారు చేయించారు. గుజరాత్​లోని సర్దార్​ వల్లభాయ్​ పటేల్ (Sardar Vallabhbhai Patel) విగ్రహాన్ని రూపొందించిన పద్మ భూషణ్ రామ్ సుతార్ (Padma Bhushan Ram Sutar) అనే కళాకారుడు డీఎస్ విగ్రహాన్ని తయారు చేశారు.

    Amit Shah | పాలిటెక్నిక్​ మైదానంలో..

    బైపాస్​ రోడ్డులో డీఎస్​ విగ్రహావిష్కరణ అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన రైతు సభలో అమిత్​షా పాల్గొని ప్రసంగిస్తారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు గ్యాలరీలు సిద్ధం చేశారు. వర్షం పడినా సభకు అంతరాయం ఏర్పడకుండా భారీ జర్మన్​ సీలింగ్​లు వేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసుల సమన్వయంతో సమీక్షించారు.

    Amit Shah | జిల్లాకు రానున్న మంత్రులు సీతక్క, తుమ్మల

    పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క రానున్నారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైతం హాజరుకానున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...