- Advertisement -
HomeUncategorizedUnion Government | గుర్తింపు కోస‌మే ఆధార్‌, పాన్, రేష‌న్.. పౌర‌స‌త్వానికి ఐడెంటిటీ కాద‌న్న‌ కేంద్రం

Union Government | గుర్తింపు కోస‌మే ఆధార్‌, పాన్, రేష‌న్.. పౌర‌స‌త్వానికి ఐడెంటిటీ కాద‌న్న‌ కేంద్రం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Union Government | జ‌మ్మూకశ్మీర్‌లోని ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడి(Pahalgam terror attack) అనంతరం కేంద్ర ప్ర‌భుత్వం(Union Government) భార‌త పౌర‌సత్వం(Indian Citizenship) విష‌యంలో విధాన‌ప‌ర‌మైన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆధార్‌(Aadhar), పాన్‌(Pan), రేష‌న్ కార్డులు(Ration cards) కేవ‌లం గుర్తింపు కోస‌మేన‌ని, పౌర‌స‌త్వానికి ఇవి చెల్ల‌వ‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం పాస్‌పోర్టు(Passport), ఓట‌ర్ కార్డు(Voter card) మాత్ర‌మే పౌర‌స‌త్వానికి ప్ర‌తీక‌లుగా పేర్కొంది. దేశంలో అక్ర‌మంగా నివాస‌ముంటున్న వారికి ఆధార్ కార్డులు(Aadhar cards), పాన్ కార్డులు(Pan cards), రేష‌న్ కార్డుల(Ration cards) ఆధారంగా పౌర‌స‌త్వం ఇవ్వ‌బ‌డ‌ద‌ని తెలిపింది. పౌర‌స‌త్వ జారీకి వాటిని గుర్తింపుగా ప‌రిగ‌ణించ‌బోమ‌ని కేంద్రం పేర్కొంది.

Union Government | ఢిల్లీలో అక్ర‌మంగా నివాసం..

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో అక్రమంగా వివిధ దేశాలకు చెందిన ఎంతో మంది అక్ర‌మంగా నివసిస్తున్నారు. పైగా ఇలాంటి వారు ఆధార్‌, పాన్‌, రేష‌న్ కార్డులు అక్ర‌మ రీతిలో పొందారు. వీటిని ఆధారంగా చూపి భారత పౌర‌స‌త్వం(Indian Citizenship) పొందుతున్న‌ట్లు అనుమానాలున్నాయి. ప్ర‌ధానంగా బంగ్లాదేశ్‌కు చెందిన వారు, రోహింగ్యాలు(Rohingyas) ఎక్కువ‌గా భార‌త్‌లోకి అక్ర‌మంగా ప్రవేశించి ఇక్క‌డ నివాస‌ముంటున్నారు. వీరు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పొందిన ఆధార్‌, రేష‌న్ కార్డు ఆధారంగా పౌర‌స‌త్వం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

- Advertisement -

Union Government | ఢిల్లీ పోలీసుల స్పెష‌ల్ డ్రైవ్‌..

దేశ రాజ‌ధానిలో అక్ర‌మంగా నివాస‌ముంటున్న వారి కోసం ఢిల్లీ పోలీసులు గ‌త అక్టోబ‌ర్ నుంచి స్పెష‌ల్ డ్రైవ్‌(Special Drive) నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆధార్, పాన్, రేషన్ కార్డులను ఉపయోగించి భారత పౌరసత్వాన్ని తప్పుగా క్లెయిమ్ చేస్తున్న అనేక మంది విదేశీ పౌరులను ప్ర‌ధానంగా బంగ్లాదేశ్, రోహింగ్యా(Rohingya) సమాజానికి చెందిన వ్యక్తులను గుర్తించారు. ఇలాంటి వారిని ఉపేక్షించకూడ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా పౌర‌స‌త్వ విష‌యంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు కేవ‌లం గుర్తింపు కార్డులు మాత్ర‌మేన‌ని, వాటి ఆధారంగా పౌర‌స‌త్వం ఇవ్వ‌జాల‌మ‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం పాస్‌పోర్టు, ఓట‌ర్ ఐడీ ఆధారంగానే సిటిజ‌న్‌షిప్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

Union Government | ఆధార్ గుర్తింపు మాత్ర‌మే..

ప్ర‌భుత్వం ఆధార్, పాన్, రేషన్ కార్డులు వివిధ గుర్తింపు పత్రాలను జారీ చేస్తుంది. ఇవి కేవ‌లం గుర్తింపు కోసం మాత్ర‌మే. ఇవి భారత పౌరసత్వానికి(Union Government) క‌చ్చితమైన రుజువుగా పని చేయవు. ఆధార్ కార్డు గుర్తింపు, చిరునామాను నిర్ధారిస్తుంది, కానీ జాతీయతను కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) స్పష్టం చేసింది. ఇక‌, పన్ను ప్రయోజనాల కోసమే పాన్ కార్డులు జారీ చేస్తారు. సబ్సిడీపై ఆహార ధాన్యాలు, నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసేందుకు రేషన్ కార్డులు ఉపయోగప‌డ‌తాయి. వీటిలో ఏ ఒక్క‌టి కూడా దేశ పౌరసత్వాన్ని ప్ర‌తిబింబించవు.

Union Government | జ‌న‌న, నివాస ధ్రువీక‌ర‌ణ‌లే కీల‌కం..

మ‌న దేశంలో జనన ధ్రువీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ ఆధారంగానే ప్రభుత్వం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కీలకమైన పత్రాలుగా పరిగణిస్తుంది. జనన, మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం అధికారులు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. భారతదేశంలో జన్మించిన వారికి మాత్ర‌మే పౌరసత్వానికి రుజువుగా ఈ ప‌త్రాలు పనిచేస్తాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News