అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Central Cabinet | కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్‌ను (critical mineral recycling) ప్రోత్సహించడానికి రూ.1,500 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ అయింది. పలు ఖనిజాల వెలికితీత, బ్యాటరీ, ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించింది. ద్వితీయ వనరుల నుంచి కీలకమైన ఖనిజాలను వేరు చేయడం, ఉత్పత్తి చేయడం కోసం దేశంలో రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 1,500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది.
Central Cabinet | సామర్థ్యాన్ని పెంపొందించడానికి..
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌లో (National Critical Mineral Mission) (NCMM) భాగంగా కీలకమైన ఖనిజాలలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించాలని కేంద్రం యోచిస్తోంది. ఖనిజాల అన్వేషణ, వేలం, గని నిర్వహణ కోసం నిధులు వినియోగించనుంది. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు అమలులో ఉంటుంది. అర్హత కలిగిన ఫీడ్‌స్టాక్ ఇ-వేస్ట్, లిథియం అయాన్ బ్యాటరీ (LIB) స్క్రాప్ రీసైక్లింగ్ చేసి ఖనిజాలు వెలికి తీయడం దీని ఉద్దేశం. ఇప్పటికే ఉన్న రీ సైక్లింగ్ యూనిట్లకు, కొత్తగా స్థాపించే వారికి ఈ పథకం కింద ప్రోత్సాహకం అందించనున్నారు.
Central Cabinet | యూనిట్లకు సబ్సిడీ
మినరల్ రీ సైక్లింగ్ పథకం (Mineral Recycling Scheme) కింద నిర్దిష్ట కాలపరిమితిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్లాంట్, యంత్రాలు, పరికరాలు అనుబంధ యుటిలిటీలపై 20శాతం సబ్సిడీని కేంద్రం అందించనుంది. ఈ పథకం అమలులోకి వస్తే ఏటా కనీసం 270 టన్నుల ఈ– వేస్ట్‌ను రీసైక్లింగ్ చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో 40 టన్నుల కీలకమైన ఖనిజ ఉత్పత్తి జరుగుతుందని పేర్కొంది.