HomeజాతీయంUnion Cabinet | నేడు కేంద్ర కేబినెట్​ భేటీ.. ఢిల్లీ పేలుడుపై చర్చించే అవకాశం

Union Cabinet | నేడు కేంద్ర కేబినెట్​ భేటీ.. ఢిల్లీ పేలుడుపై చర్చించే అవకాశం

కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Union Cabinet | కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో సోమవారం పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. పలువురు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటకు బాధ్యులైన వారిని వదలిపెట్టమని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రి వర్గ సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పేలుడు ఘటనతో పాటు పలు ప్రధాన అంశాలపై మీటింగ్​లో చర్చించనున్నారు. కాగా ఢిల్లీ ఘటనపై ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్​ షా (Home Minister Amit Shah) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ప్రస్తుతం ప్రధాని భూటాన్​ (Bhutan) పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఆయన భూటాన్​కు వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. తిరుగు ప్రయాణానికి ముందు భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌తో మోదీ సమావేశం అయ్యారు. భూటాన్ రాజుతో కలిసి జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించారు. రక్షణ, ఇంధనం, సాంకేతికతపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిపారు.

Must Read
Related News