అక్షరటుడే, వెబ్‌డెస్క్: Union Budget Effect | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌తో పలు వస్తువుల ధరలు దిగి రానున్నాయి.
సోలార్, లెదర్ ఉత్పత్తులపై పన్నులను నిర్మలమ్మ తగ్గించారు. దీంతో ఆయా వస్తువుల ధరలు దిగి రానున్నాయి. CNG, బయోగ్యాస్ ధరలు కూడా తగ్గనున్నాయి. 17 రకాల క్యాన్సర్ మందులపై దిగుమతి సుంకం 20 నుంచి 10 శాతానికి తగ్గించారు. దీంతో ఆయా మందుల రేట్లు తగ్గి పేషేంట్లకు మేలు జరగనుంది.
Union Budget Effect | ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు..
సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) బ్యాటరీలపై ప్రభుత్వం సుంకాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు దిగి రానున్నాయి. ముఖ్యంగా విద్యుత్ వాహనాల్లో బ్యాటరీ ధర అధికంగా ఉంటుంది. పర్యావరణ రక్షణలో భాగంగా ప్రభుత్వం బ్యాటరీలపై సుంకాలను రద్దు చేసింది. ఫలితంగా విద్యుత్ వాహనాల రేట్లు భారీగా దిగి రానున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విమానాల విడిభాగాలపైనా సుంకం రద్దు చేసింది. సోలార్ గ్లాస్ తయారీలో ఉపయోగించడానికి సోడియం యాంటీమోనేట్ (Sodium Antimonate) పై కస్టమ్స్ సుంకాలను రద్దు చేసింది. 2035 వరకు అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం వస్తువుల దిగుమతులపై కస్టమ్స్ సుంకం ఉండదని మంత్రి తెలిపారు.
Union Budget Effect | వారికి పన్ను లేదు
దేశంలోని డేటా కౌడ్ సెంటర్లకు కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది. డేటా సెంటర్లు ఉపయోగించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు పన్ను రద్దు చేసింది. 2047 సంవత్సరం వరకు పన్ను మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే అన్ని ఐటీ సేవలను 15.5 శాతం కామన్ సేఫ్ హార్బర్ మార్జిన్‌తో ఒకే కేటగిరీ కింద కలపాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. సేఫ్ హార్బర్ ఫర్ ఐటీ సర్వీసులను పొందేందుకు ఉన్న పరిమితిని రూ. 300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచాలన్నారు.