Homeజిల్లాలునిజామాబాద్​Navipet | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Navipet | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన నవీపేట్​ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, నవీపేట్​: Navipet | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన నవీపేట్​ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

స్థానికులు ​తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేట్​ నుంచి బాసర (Basara) వెళ్లే దారిలో నాగేపూర్​​ (Nagepur) శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు నవీపేట్​ పోలీసులకు (Navipet Police) సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

అయితే మహిళ మృతదేహం కాలిపోయి ఉండడాన్ని గమనించిన పోలీసులు.. గురువారం రాత్రి ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.