అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలోని బోర్గాం వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నాలుగో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని బోర్గాం వంతెన (Borgaon Bridge) పక్కన వాగులో మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు.
అనంతరం నాల్గో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. వాగులో పడి మృతి చెందాడా..? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.