అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నగరంలోని నిజాంసాగర్ కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆరో టౌన్ ఎస్హెచ్వో వెంకట్రావు (6th Town SHO Venkat Rao) తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని డెయిరీ ఫామ్ కమాన్ వద్ద ఉన్న నిజాంసాగర్ కెనాల్లో శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు.
కాలువలో పడి మృతి చెందిన వ్యక్తి మగవ్యక్తిగా గుర్తించామని ఎస్హెచ్వో తెలిపారు. సుమారు 40 ఏళ్లు ఉంటాయని.. ఆనవాళ్లు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా మృతుడి సమాచారం తెలిస్తే ఆరో టౌన్ పోలీస్స్టేషన్(6th Town Police Station)లో సంప్రదించాలని వారు కోరారు.
మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షం(Heavy Rain) కారణంగా కెనాల్లో మరో ప్రాంతం నుంచి మృతదేహం కొట్టుకొచ్చిందా.. లేక ఎవరైనా ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెంది ఉంటారా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.