అక్షరటుడే, గాంధారి: Gandhari | ఉమ్మడి జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలో (Armoor Town) మంగళవారం భార్యను భర్త (husband) అనుమానంతో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.
తాజాగా.. గాంధారి మండలంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని (Gandhari mandal) చద్మల్‌కు వెళ్లే శివారులో గుంతలో ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేసినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాస్, సదాశివనగర్ సీఐ సంతోష్‌కమార్, ఎస్సై ఆంజనేయులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కామారెడ్డి జీజీహెచ్ (Kamareddy GGH) మార్చురీకి తరలించారు. క్లూస్‌టీం, డాగ్ స్వ్కాడ్‌తో పరిశీలన చేశారు. మృతుడి వయస్సు 30 ఏళ్లు ఉంటుందని.. సమాచారం నిమిత్తం గాంధారి పోలీస్‌స్టేషన్‌లో 8712686165 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.