16
అక్షరటుడే, బోధన్: Yedapally | రైల్వేట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన జానకంపేట్ నుంచి నవీపేట్ (Janakampet to Navipet) వెళ్లే దారిలో చోటు చేసుకుంది.
ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ (SI Mutyala Rama) తెలిపిన వివరాల ప్రకారం.. జానకంపేట్ నుంచి నవీపేట్ మండలానికి వెళ్లే దారిలో రైల్వేట్రాక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ఎడపల్లి పోలీసులు (Yedapalli police) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్ పక్కన గుంతలో పడి ఉన్న సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తిని బోధన్ వాసిగా ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.