అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PDSU Nizamabad | జిల్లాలో ఫిట్నెస్ స్కూల్ బస్సులను తక్షణమే సీజ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో (District Transport Office) అధికారి రాహుల్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 780కు పైగా ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు ఉన్నాయని.. సగానికి పైగా బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించలేని పేర్కొన్నారు. కొన్ని విద్యాసంస్థలు కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నాయని వివరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు నిఖిల్, దుర్గప్రసాద్, వేణు, దేవిక తదితరులున్నారు.
