అక్షరటుడే, బోధన్: Yedapally | పెళ్లింట్లో ఊహించని విషాదం నెలకొంది. ఒక రోజులో పెళ్లి ఉండగా.. పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎడపల్లి ఎస్సై రమ (Yedapally SI Rama) తెలిపిన ప్రకారం.. ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్ గ్రామానికి చెందిన ప్రతాప్‌గౌడ్‌కు ఈనెల 13వ తేదీ పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే ప్రతాప్ గౌడ్ రెండురోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబీలకు అతడి కోసం తీవ్రంగా గాలించారు. గ్రామశివారులో బుధవారం ప్రతాప్‌గౌడ్ ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు (family members) సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎడపల్లి ఎస్సై రమ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
