Homeతాజావార్తలుBigg Boss9 | బిగ్ బాస్‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. ఆమెని ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు ?

Bigg Boss9 | బిగ్ బాస్‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. ఆమెని ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు ?

బిగ్ బాస్ షోలో ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రీతూ ఇప్పటికే ఎలిమినేట్ అయినట్లయితే, రెండో ఎలిమినేషన్‌గా సుమన్ శెట్టి పేరు బలంగా వినిపిస్తోంది

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bigg Boss 9 | బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9లో (Bigg Boss Telugu Season 9) 13వ వారం ఎలిమినేషన్ చుట్టూ ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ వారం నామినేషన్‌లో తనూజ, డీమాన్ పవన్, భరణి, సంజనా, సుమన్ శెట్టి, రీతూ చౌదరీ (Ritu Chaudhary) లాంటి ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా, ఎవరు బయటకు వెళతారన్న ఉత్కంఠ పెరిగింది. వీరిలో ఓటింగ్ ధోరణి చూస్తే సుమన్ శెట్టి లీస్ట్‌లో కొనసాగుతూ రావడంతో, అధికారిక ఓటింగ్‌ ఫలితాలతో పాటు సోషల్ మీడియా పోల్స్ కూడా ఆయనే ఎలిమినేట్ అవుతారని బలంగానే సూచించాయి.

Bigg Boss 9 | ఇలా చేశారేంటి?

లెక్కలు, లాజిక్ అన్నీ సుమన్ శెట్టి వైపే చూపినా, చివరి నిమిషంలో బిగ్ బాస్ అనూహ్యంగా పెద్ద ట్విస్ట్ క్రియేట్ చేశారు. ప్రచారం మేరకు సుమన్‌ స్థానంలో రీతూ చౌదరీని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఓటింగ్‌లో లీస్ట్‌లో లేని రీతూని, లీస్ట్‌లో ఉన్న సుమన్ శెట్టిని (Suman Shetty) సేవ్ చేయడం వల్ల షో ఫాలోవర్స్ అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రేక్షకులు ఊహించినదానికి పూర్తిగా విరుద్ధంగా వచ్చిన ఈ ట్విస్ట్ చర్చనీయాంశంగా మారింది. రీతూని ఎలిమినేట్ చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయని కూడా అంతర్గత సమాచారం చెబుతోంది. గత కొన్ని వారాలుగా రీతూ ఆటలో కంటే అరవ‌డం, భావోద్వేగ రియాక్షన్‌లు ఎక్కువైపోయాయని, సింపతీ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోందని, ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ హౌజ్‌లోని వారిని ఇబ్బంది పెడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అదనంగా డీమాన్ పవన్‌తో బాండింగ్‌ను సింపతీ కోసమే ఉపయోగిస్తోందని, ప్రత్యేకంగా ప్రేక్షకుల నుంచి వ్యతిరేక స్పందన పెరుగుతోందని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే బిగ్ బాస్ ఆమెను ఈ వారం బయటకు పంపాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ ఉంది. నెటిజన్ల రియాక్షన్ చూస్తే కూడా రీతూ ఈ మధ్యకాలంలో హౌజ్‌లో అత్యంత ఇరిటేట్ చేస్తున్న కాంటెస్టెంట్ అనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

అరుపులు, ఆకస్మిక భావోద్వేగాలు, డేమన్ పవన్‌తో (Damon Pawan) బాండింగ్ ఇవన్నీ వీక్షకులకు విసుగు కలిగిస్తున్నాయని పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక షో ముగింపుకు కేవలం రెండు వారాలే ఉండగా కూడా రీతూ గేమ్‌‌పై కాకుండా సింపతీపై ఆధారపడటం మిగిలిన కంటెస్టెంట్లకు కూడా అసౌకర్యం కలిగించిందని భావిస్తున్నారు. దీంతోనే ఆమె ఎలిమినేషన్‌కు ఓటింగ్ కారణం కాదని, కంటెంట్ కారణం అని అనేక సోషల్ మీడియా చానెల్స్ ప్రచారం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రీతూ ఇప్పటికే ఎలిమినేట్ అయినట్లయితే, రెండో ఎలిమినేషన్‌గా సుమన్ శెట్టి పేరు బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో సంజనా మరియు భరణి కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళతారు, డబుల్ ఎలిమినేషన్ నిజమవుతుందా అన్న విషయంపై క్లారిటీ రానున్న ఎపిసోడ్‌తో తెలుస్తుంది. మొత్తం మీద 13వ వారం అనేది బిగ్ బాస్ తెలుగు 9లో ఇప్పటి వరకు జరిగిన వారాల్లో అత్యంత సంచలన ఎలిమినేషన్ వీక్‌గా మారింది.

Must Read
Related News