ePaper
More
    HomeజాతీయంHaryana | జిమ్​ ఎక్సర్​సైజ్​ చేస్తూ కుప్పకూలిన యువకుడి..​ వీడియో వైరల్

    Haryana | జిమ్​ ఎక్సర్​సైజ్​ చేస్తూ కుప్పకూలిన యువకుడి..​ వీడియో వైరల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Haryana | బరువు తగ్గాలని ఆశతో జిమ్‌కు వెళ్లిన వ్యక్తి, అక్కడే జీవితాన్ని కోల్పోయాడు. ఫిట్‌నెస్‌ (Fitness) కోసం ఎక్సర్‌సైజ్ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు (Heart attack) రావడంతో 37 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో చోటు చేసుకుంది. జిమ్‌లో కుప్పకూలుతున్న వ్య‌క్తికి సంబంధించిన‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడిని పంకజ్ శర్మ (37)గా గుర్తించారు. అతను రాజానహర్‌సింగ్ కాలనీకి చెందినవాడు. పంకజ్‌కు బరువు 170 కిలోలు ఉండడంతో గత నాలుగు నెలలుగా బరువు తగ్గేందుకు జిమ్‌లో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాడు.

    Haryana | ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌..

    సాధారణంగా వర్కౌట్ చేయడానికి ముందు బ్లాక్ టీ (Black tea) తాగిన పంకజ్, ఆ రోజూ కూడా అదే విధంగా పుల్‌అప్స్ చేయడం ప్రారంభించాడు. అయితే, ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న జిమ్ ట్రైనర్లు (GYM Trainers), స్నేహితులు వెంటనే స్పందించి సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) చేసే ప్రయత్నం చేశారు. నీళ్లు తాగించి స్పృహకు తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే ఏ మాత్రం స్పందించ‌క‌పోవ‌డంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అత‌ను అప్పటికే మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు ధృవీకరించారు.

    ఘటనపై పోలీసులు కేసు నమోదు (Police case registered) చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న భద్రతా చర్యలపై విచారణ కొనసాగుతోంది. అలాగే జిమ్‌లో ప్రాథమిక వైద్య సౌకర్యాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ (emergency response) ఉన్నాయా? అనే కోణంలోనూ పరిశీలన జరుగుతోంది. జిమ్‌లో పంకజ్ ఒక్కసారిగా కుప్పకూలే దృశ్యం సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footage) ద్వారా బయటపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పలు ప్లాట్‌ఫాంలపై వైరల్ అవుతూ, జిమ్‌లో వర్కౌట్స్ (Work Outs) విషయంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన భద్రతా చర్యలపై చర్చకు దారి తీస్తోంది. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలానే జరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు ఉన్నవారు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, వైద్య పరీక్షలు చేయించుకోకుండా భారీ వర్కౌట్స్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని వారు అంటున్నారు.

    Latest articles

    Free Bus Scheme | ఏపీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై కీల‌క అప్‌డేట్.. ఎవ‌రు అర్హులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(Andhra Pradesh Government) మహిళల కోసం మరో...

    Upasana Kamineni | మెగా కోడ‌లికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. చిరు, రామ్ చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Upasana Kamineni | మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు తెలంగాణ...

    Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లన్నీ పాజిటివ్‌గా ఉన్నా.. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులతో...

    Guvvala Balaraju | కేసీఆర్‌ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్​ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు...

    More like this