Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | కడుపునొప్పి భరించలేక గడ్డి మందు తాగిన యువకుడు.. చికిత్స పొందుతూ మృతి

Indalwai | కడుపునొప్పి భరించలేక గడ్డి మందు తాగిన యువకుడు.. చికిత్స పొందుతూ మృతి

- Advertisement -

అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు గడ్డిమందు తాగగా.. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై సందీప్ (SI sandeep)​ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలంలోని గన్నారం (Gannaram) గ్రామానికి చెందిన నాగుల హరికృష్ణ (22) కడుపునొప్పి భరించలేక మూడురోజుల క్రితం గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు నగరంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చేతికందిన కొడుకు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.