అక్షరటుడే, న్యూఢిల్లీ: United Nations : భారత్ – పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ UN Secretary General Antonio Guterres పేర్కొన్నారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.
పహల్ గామ్ దాడి Pahalgaon terror attack తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలమని గుటెరస్ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో పొరపాట్లు చేయొద్దని, అన్నింటికి సైనిక చర్య పరిష్కారం కాదని అన్నారు. ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా సహకరిస్తామని గుటెరస్ హామీ ఇచ్చారు.