Homeబిజినెస్​Adani Group | వామ్మో.. అదానీ గ్రూప్‌ అన్ని వేల కోట్ల ట్యాక్స్‌ చెల్లించిందా..!

Adani Group | వామ్మో.. అదానీ గ్రూప్‌ అన్ని వేల కోట్ల ట్యాక్స్‌ చెల్లించిందా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Adani Group | గత ఆర్థిక సంవత్సరం(2024-25)లో అదానీ గ్రూప్‌(Adani group) సుమారు రూ. 75 వేల కోట్ల పన్నులు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ. 58 వేల కోట్లుగా ఉంది. అయితే ఇది సోషల్‌ మీడియా(Social media)లో మాత్రమే వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించి అధికారిక ఆర్థిక నివేదికలనుంచి ఎలాంటి సమాచారం లేదు.

అదానీ గ్రూప్‌లో ఎనిమిది లిస్టెడ్‌ కంపెనీలున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌(Adani enterprises) లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, అదానీ పవర్‌ లిమిటెడ్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌, అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌, ఏసీసీ సిమెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఉన్నాయి. అదానీ గ్రూప్‌ చెల్లించిన మొత్తం ట్యాక్స్‌(Tax)లో గ్రూప్‌ సంస్థలు డైరెక్ట్‌ చెల్లించిన పన్నులు, డ్యూటీలు, ఇతర ఛార్జీలతోపాటు ఇతర స్టేక్‌ హోల్డర్ల తరపున సేకరించి చెల్లించిన పన్నులు, డ్యూటీలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల సామాజిక భద్రత కోసం చెల్లింపులూ ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్‌ సుమారు రూ. 75 వేల కోట్ల పన్నులు చెల్లించినట్లు సమాచారం. ఇందులో గ్రూప్‌ డైరెక్ట్‌ కంట్రిబూషన్‌(Direct contribution) కింద రూ. 28,720 కోట్ల ట్యాక్స్‌లు చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఇన్‌డైరెక్ట్‌ కంట్రిబూషన్‌ కింద రూ. 45 వేల కోట్లు, ఇతర కంట్రిబూషన్‌ కింద మరో రూ. 818 కోట్లు చెల్లించినట్లుగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గణాంకాలు ప్రచారమవుతున్నాయి. అయితే ఈ గణాంకాలను ఇటు అదానీ గ్రూప్‌ కానీ, అధికారిక ఆర్థిక నివేదికలుగానీ ధ్రువీకరించలేదు.