అక్షరటుడే, ఇందూరు: Umarani Mayor Oath | నిజామాబాద్ నగరపాలక సంస్థ (Nizamabad Municipal Corporation) మేయర్‌గా కూరగాయల ఉమారాణి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో (Nizamabad Mayor) పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు.
Umarani Mayor Oath | 49వ డివిజన్ నుంచి..
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 49వ డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని (Congress Party) ఉమారాణి విజయం సాధించారు. ఆమె భర్త కరాటే రమేష్ కాంగ్రెస్ పార్టీలో సుపరిచితుడు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు కొన్నేళ్లుగా మిత్రుడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించుకున్న కరాటే రమేష్ 49వ డివిజన్ నుంచి తన సతీమణి ఉమారాణిని బరిలో నిలిపారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఉదయం పది గంటలకు..
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు మేయర్ ఉమారాణి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ (Municipal Commissioner Dilip Kumar) తెలిపారు. కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.