అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Blast | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన ఐ20 కారు బాంబు పేలుడుతో (Delhi Blast) దేశం షాక్‌కు గురైంది.
ఈ ఆత్మాహుతి దాడిలో భాగస్వామిగా ఉన్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ గతంలో పనిచేసిన యూనివర్సిటీలో విచిత్రంగా ప్రవర్తించినట్టు ఆయనకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా టుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (Special Investigation Team) ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీలో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వివరాలు బయటపడ్డాయి.
Delhi Blast | తాలిబన్ తరహా కఠిన నిబంధనలు..
డాక్టర్ ఉమర్ మహమ్మద్, అలాగే ఈ ఉగ్రకుట్రలో మరో నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ సయీద్.. ఇద్దరూ ఈ అల్ ఫలా యూనివర్సిటీ (Al Falah University)లో అధ్యాపకులుగా పనిచేసినట్టు తెలిసింది. రహస్యంగా మాట్లాడిన విద్యార్థులు, సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం.. ఉమర్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేదని వెల్లడించారు. ఓ ఎంబీబీఎస్ MBBS విద్యార్థి వెల్లడించిన ప్రకారం.. మేమంతా క్లాసులో కలిసి కూర్చునేవాళ్లం. కానీ ఉమర్ సార్ రాగానే అబ్బాయిలు – అమ్మాయిలను విడిగా కూర్చోబెట్టేవారు. అతని నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని అన్నారు.
సిబ్బంది కూడా ఉమర్ గురించి ఇలాగే వివరించారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడకపోవడం, ఎప్పుడూ ఒంటరిగా గడపడం, క్యాంపస్‌లోని హాస్టల్‌లోనే నివసించడం.. ఈ ప్రవర్తన విద్యార్థుల్లో అనేక అనుమానాలకు దారితీసిందని పేర్కొన్నారు. మరో నిందితురాలు డాక్టర్ షహీన్ సయీద్‌పై విద్యార్థులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆమె పాఠాలు చాలా బాగా చెప్పేదని, తరగతుల్లో ఎలాంటి అసాధారణ ప్రవర్తన కనిపించలేదని తెలిపారు. ఎస్ఐటీ దర్యాప్తుతో కీలక అంశాలు బయటపడ్డాయి.
ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌తో (String Operation) ఎర్రకోట పేలుడు కుట్రలో కీలక పాత్రలో ఉన్న నిందితుల వ్యక్తిగత స్వభావం, యూనివర్సిటీ రోజుల ప్రవర్తనపై కొత్త కోణాలు వెలుగులోకి రావడంతో విచారణను మరింత వేగవంతం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
