ePaper
More
    HomeతెలంగాణUltraviolet experience center | అందుబాటులోకి అల్ట్రావయొలెట్ రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌.. పొందుతారా అధునాతన సాంకేతిక...

    Ultraviolet experience center | అందుబాటులోకి అల్ట్రావయొలెట్ రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌.. పొందుతారా అధునాతన సాంకేతిక అనుభూతి..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Ultraviolet experience center : యూరప్​ (Europe) లో విజయవంతంగా తన ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాల ఉత్పత్తులను విక్రయిస్తున్న అల్ట్రావయొలెట్.. భారత్​లోనూ తమ కేంద్రాల విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.

    ఈ క్రమంలో హైదరాబాద్‌లో అధునాతన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను తాజాగా అల్ట్రావయొలెట్ ఆవిష్కరించింది. తద్వారా భారత్​లో అల్ట్రావయొలెట్ వృద్ధి ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా కంపెనీ పేర్కొంటోంది.

    కంపెనీ తీసుకున్న ఈ అడుగు.. దేశవ్యాప్తంగా పర్యావరణహితమైన విద్యుత్తు ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తేవడంలో చూపుతున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలువనుంది.

    సన్‌రైజ్ మోటోహైవ్ (Sunrise Motohive LLP) డీలరు భాగస్వామ్యంతో హైదరాబాద్​లో అల్ట్రావయొలెట్ కొత్తగా యూవీ స్పేస్ స్టేషన్​ను నెలకొల్పింది.

    ఇది అల్ట్రావయొలెట్ పర్ఫార్మెన్స్ మోటర్‌సైకిల్స్ – F77 మాక్ 2(F77 Mach 2), F77 సూపర్‌స్ట్రీట్ (F77 Superstreet) గురించి తెలుసుకునేందుకు తోడ్పడుతుందంటున్నారు కంపెనీ ప్రతినిధులు.

    ఇక యూవీ స్పేస్ స్టేషన్.. 3S ఫెసిలిటీగా ఉండనుంది. ఇక్కడ టెస్ట్ రైడ్ అనుభూతి, విక్రయాలు, సర్వీస్, ఛార్జింగ్ మోటర్‌సైకిల్ యాక్సెసరీలు అందుబాటులో ఉంటాయి.

    Ultraviolet experience center : స్పెషల్​ ఫీచర్స్..

    ఈ అల్ట్రావయొలెట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో F77 మాక్2, F77 సూపర్‌స్ట్రీట్ డిస్‌ప్లే ఉంటుంది. 40.2 hp పవర్‌ట్రైన్, 100 Nm టార్క్‌ దన్నుతో కేవలం 2.8 సెకన్లలోనే 0 నుంచి గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకునే అత్యంత సమర్ధవంతమైన వాహనాలుగా వీటిని తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 10.3kWh బ్యాటరీ సామర్థ్యంతో రూపొందిన ఈ వాహనాలు.. ఒక్కసారి ఛార్జి చేస్తే 323 కి.మీ. IDC రేంజి వరకు వెళ్తాయి.

    హైదరాబాద్​లోని ఉప్పల్​ అల్ట్రావయొలెట్ Ultraviolet ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా సీటీవో & సహ-వ్యవస్థాపకుడు నీరజ్ రాజ్‌మోహన్ (Niraj Rajmohan) మాట్లాడారు.

    “హైదరాబాద్‌లో మా రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఇది కేవలం మా కంపెనీ కార్యకలాపాల విస్తరణకే కాకుండా.. దేశంలోనే అత్యంత డైనమిక్ ఈవీ కమ్యూనిటీల్లో ఒకటైన ఈ ప్రాంతం నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం.. అని అన్నారు.

    హైదరాబాద్​ నగర వాసుల్లో పురోగామి ఆలోచనా విధానం, కొత్త ఆవిష్కరణలపై ఉత్సుకత గణనీయంగా కనిపిస్తుంది.. పనితీరు, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన ఇంజినీరింగ్‌కి విలువనిచ్చే వారితో కలిసి పని చేయడానికి ఇక్కడ ఎంతో అనువైన వాతావరణం ఉంది.. అని పేర్కొన్నారు.

    Ultraviolet experience center : వయొలెట్​ ఏఐ ఫీచర్స్..

    వాహనాల విషయానికి వస్తే.. కొత్త ఆవిష్కరణలతో ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిణామక్రమాన్ని పునర్నిర్వచిస్తూ, పనితీరును మరింతగా మెరుగుపర్చే “జెన్3 పవర్‌ట్రైన్ ఫర్మ్‌వేర్”, ‘బాలిస్టిక్+’ అనేవి గత F77లతో పాటు కొత్త కస్టమర్లకు కూడా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అందుబాటులోకి తెచ్చింది.

    F77లు ఇప్పుడు మరింత వేగవంతమైన రెస్పాన్స్, యాక్సెలరేషన్, ఇనీషియల్ సర్జ్‌ను అందిస్తాయి. 2024లో తొలి దశలో F77లలో ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (UVDSC), 10 స్థాయుల రీజెనరేటివ్ బ్రేకింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, వయొలెట్ A.I. లాంటి అనేక భద్రత ఫీచర్లపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది.

    Ultraviolet experience center : ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ‘షాక్‌వేవ్’

    ఈ ఏడాది తొలినాళ్లలో అల్ట్రావయొలెట్ ప్రవేశపెట్టిన రెండు కొత్త ఉత్పత్తులకు కూడా విశేష స్పందన లభించింది. ఆమ్నిసెన్స్ మిర్రర్స్‌తో పాటు సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సమగ్ర రాడార్, డ్యాష్‌క్యామ్ ఈ వాహనాల సొంతం.

    ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘టెసెరాక్ట్’ (‘Tesseract’), ఉత్తేజభరితమైన రైడింగ్ అనుభూతిని కోరుకునే రైడర్ల డిమాండ్లకు అనుగుణంగా వీటని తీర్చిదిద్దారు. సంచలనాత్మక ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ‘షాక్‌వేవ్’ (‘Shockwave’) కూడా వీటిలో ఉన్నాయి.

    ఉప్పల్‌లో యూవీ స్పేస్ స్టేషన్ చిరునామా..

    సాయినగర్ రోడ్, రాక్ టౌన్ రెసిడెంట్స్ కాలనీ, ఎల్‌బీ నగర్, హైదరాబాద్– 500068.

    Latest articles

    Roads Damage | భారీ వర్షాలతో 1,039 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Roads Damage | రాష్ట్రంలో భారీ వర్షాలతో (Heavy rains) తీవ్ర నష్టం వాటిల్లింది....

    Peddareddy | మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddareddy | వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో (Supreme Court)...

    Megastar Chiranjeevi | మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న చిరంజీవి.. సైకిల్‌పై వ‌చ్చిన అభిమానిని స‌ర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా(Karnool District), ఆదోని పట్టణానికి చెందిన...

    Jio IPO | శుభవార్త చెప్పిన అంబానీ.. త్వరలో ఐపీవోకు జియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jio IPO | బిలియనీర్‌ మరియు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ(Mukesh Ambani)...

    More like this

    Roads Damage | భారీ వర్షాలతో 1,039 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Roads Damage | రాష్ట్రంలో భారీ వర్షాలతో (Heavy rains) తీవ్ర నష్టం వాటిల్లింది....

    Peddareddy | మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddareddy | వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో (Supreme Court)...

    Megastar Chiranjeevi | మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న చిరంజీవి.. సైకిల్‌పై వ‌చ్చిన అభిమానిని స‌ర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా(Karnool District), ఆదోని పట్టణానికి చెందిన...