ePaper
More
    Homeఅంతర్జాతీయంUK e-Visa | యూకే కీలక నిర్ణయం.. రేపటి నుంచి అమలులోకి ఈ– వీసా

    UK e-Visa | యూకే కీలక నిర్ణయం.. రేపటి నుంచి అమలులోకి ఈ– వీసా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UK e-Visa | ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్​పోర్టు (Pass Port)తో పాటు వీసా తప్పనిసరి. భారత్​ నుంచి కొన్ని దేశాలకు వీసా (Visa) లేకున్నా ప్రయాణించే అవకాశం ఉన్నా చాలా దేశాలకు వీసా ఉంటేనే అనుమతిస్తారు. ప్రస్తుతం అప్లై చేసుకున్నా వీసా పత్రాలు అందిస్తారు. అయితే ఇంగ్లాండ్​ వీసాల జారీల కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం అందిస్తున్న వీసా స్థానంలో ఈ–వీసా జారీ చేయాలని నిర్ణయించింది. జులై 15 నుంచి దేశంలో ఈ–వీసా అమలులోకి రానుంది.

    మన దేశం నుంచి ఎంతో మంది యూనైటెడ్​ కింగ్​డమ్ ​(United Kingdom) వెళ్తుంటారు. అందులో ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లే విద్యార్థులు సైతం అధిక సంఖ్యలో ఉంటారు. అయితే యూకే ప్రభుత్వం (UK Government) తాజాగా వీసాల జారీలో మార్పులు తీసుకు రావడంతో ఆ దేశానికి వెళ్లాలనుకునే వారు కొత్త రూల్స్​ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 15 నుంచి యూకే ఏ వీసాలు తీసుకోవాలన్నా.. పాస్​పోర్టుతో ఈ‌‌ వీసా లింక్​ అయి డిజిటల్​ విధానంలో కొనసాగనుంది. ఇమిగ్రేషన్ ప్రక్రియ (Immigration Process)ను గాడిన పెట్టేందుకు కొత్త విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    READ ALSO  Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    UK e-Visa | ఫిజికల్​ వీసా స్టిక్కర్ల స్థానంలో..

    ప్రస్తుతం యూకే ప్రభుత్వం ఫిజికల్​ వీసా స్టిక్కర్లు (Physical Visa Stickers) జారీ చేస్తోంది. మంగళవారం నుంచి అవి ఉండవు. ఈ–వీసా జారీ చేస్తారు. దీనికోసం యూకే వెళ్లేవారు డిజిటల్, ప్రొసీజరల్ అంశాలను ప్రయాణానికి ముందే సరిచూసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.

    వీసా విగ్నెట్​ స్థానంలో ఈ–వీసా(e- Visa) జారీ అవుతుందని తెలిపారు. కొత్త విధానంలో యూకే వెళ్లిన వారు తమ పాస్​పోర్ట్​ అప్​డేట్ ​(Passport Update)ను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఈ –వీసా పాస్​నంబర్లకు అనుసంధానం అవుతుంది. దీంతో సేవలు మరింత సులభతరం అవుతాయని యూకే అధికారులు తెలిపారు.

    UK e-Visa | ఖాతా తెరవాల్సిందే..

    యూకే వెళ్లే విద్యార్థులు (Students) యూకేవీఐ (యూకే వీసా, ఇమ్మిగ్రేషన్​) ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్​ ద్వారానే ఈ – వీసాను నిర్వహించాలి. వీసా వివరాలు, ఇతర అప్​డేట్లు, ఇమిగ్రేషన్ స్టేటస్ సమాచారం ఆయా కంపెనీలు, విద్యాసంస్థలకు అందజేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే విద్యార్థులు ఇంగ్లాండ్ ​(England)లో బస చేసేందుకు, కోర్సుల్లో చేరే సమయాల్లో కూడా వారు యూకేఐవీ తనిఖీ చేసే అవకాశం కల్పించారు. కంపెనీలు, ఇళ్లను అద్దెకిచ్చేవారు, విశ్వవిద్యాలయాలు(Universities) కూడా యూకేవీఐ ఖాతాను చేయొచ్చు.

    READ ALSO  Schools | 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు.. ఆందోళనలో విద్యార్థులు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...