అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Youtuber Anvesh | ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌కు ఉక్రెయిన్ మహిళ మాస్ వార్నింగ్ ఇచ్చింది. తనకు అవకాశం ఇస్తే అతడిని పట్టుకొస్తానని చెప్పింది. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసింది.
నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్ (Na Anveshana YouTube Channel) పేరిట ఫేమస్ అయిన అన్వేష్ ఇటీవల హిందు మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దండోరా సినిమా (Dandora Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సీతమ్మ, ద్రౌపదీపై అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందువులు అతడిపై మండి పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెడుతున్నారు. అన్వేష్‌ను అరెస్ట్ చేయాలని, అతడి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఉక్రెయిన్ మహిళ (Ukrainian Woman) సైతం అతడికి వార్నింగ్ ఇచ్చింది.
Youtuber Anvesh | మోకాళ్లపై కూర్చొబెడతా..
ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి మాట్లాడుతూ.. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్ ఎక్కడ ఉన్నా భారత్‍కు తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చోబెడతానని పేర్కొంది. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించింది. అన్వేష్ పతనం మొదలైందని ఆమె అన్నారు. కాగా ఉక్రెయిన్‌కు చెందిన లిడియా ఆంధ్రకు చెందిన తుమ్మలపాల వెంకట్‍ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ (Ukrainian Embassy)లో పని చేస్తోంది. హిందు మతం స్వీకరించిన ఆమె తాజాగా అన్వేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. వీడియో రిలీజ్ చేశారు. అన్వేష్ కాంబోడియా, మలేషియా పారిపోయాడని ఇప్పుడు థాయ్‌లాండ్‌లో ఉన్నాడని చెప్పారు.