HomeUncategorizedRussia - Ukraine War | ఉక్రెయిన్‌ డ్రోన్​ దాడులు.. 40 రష్యా విమానాలు ధ్వంసం

Russia – Ukraine War | ఉక్రెయిన్‌ డ్రోన్​ దాడులు.. 40 రష్యా విమానాలు ధ్వంసం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Russia – Ukraine War | రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం (Russia – Ukraine War) తీవ్రం అవుతోంది. ఓ వైపు యుద్ధం ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ (US President Trump) ప్రయత్నిస్తున్న సమయంలో ఇరు దేశాలు దాడులు చేసుకుంటుండటం గమనార్హం. మూడు రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా బీకర దాడులు చేసింది. మిసైళ్లతో ఆదేశంలోని ప్రధాన నగరాలపై విరుచుకు పడింది. ఈ క్రమంలో ఆదివారం ఉక్రెయిన్​ ప్రతీకార దాడులకు దిగింది. వందలాది డ్రోన్లతో రష్యాపై దాడి చేసింది.

Russia – Ukraine War | రష్యాకు తీవ్ర నష్టం

రష్యాలోని ఎయిర్​బేస్​ (Russia Airbase)లే లక్ష్యంగా ఉక్రెయిన్​ దాడులకు తెగబడింది. ఐదు ఎయిర్‌బేస్‌లపై డ్రోన్​ దాడులు చేసింది. ఖలీనో, సవస్లేయ్కా, బోరిసోగ్లెబ్స్క్, బాల్టిమోర్ ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఇంధన గోడౌన్లు, ఆయుధ నిల్వలు ధ్వంసం చేసింది. సైబీరియాలోని బెలాయ ఎయిర్‌బేస్‌పైనా దాడి చేసింది. డ్రోన్​ దాడుల్లో రష్యాకు చెందిన 40 విమానాలు ధ్వంసం అయినట్లు సమాచారం. మరోవైపు 524 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా ప్రకటించింది.

Must Read
Related News