HomeUncategorizedUK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం... రోడ్డున పడనున్న...

UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల మంది ఉద్యోగులు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UK telecom company BT : ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోంది. ఏ రంగంలో చూసినా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. అదీనూ​ పదులు, వందల్లో కాకుండా.. వేల సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తున్నారు.

తాజాగా బ్రిటన్ లోని అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సంస్థ బీటీ గ్రూప్(Britain’s largest broadband company BT Group) తన ఉద్యోగుల సంఖ్యను ఒకేసారి 55 వేల మేర తగ్గించాలని భావిస్తోంది. వారి స్థానంలో ఏఐ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలనేది కంపెనీ ఆలోచన.

2030 నాటికల్లా దశల వారీగా తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది. తద్వారా సంస్థ రూ.30 వేల కోట్ల వరకు ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ సీఈవో అలైసన్ కిర్క్సి (CEO Alison Kirksey) ప్రకటించారు.

ఏఐ AI యుగంలో తక్కువ మంది ఉద్యోగులతోనే సమర్థంగా సేవలు కొనసాగించటానికి వీలుపడుతుందని సీఈవో చెప్పుకొచ్చారు. రానున్న దశాబ్దకాలంలో ఏఐతో భారీగా మార్పులు రాబోతున్నాయని చెప్పారు. ఇదే క్రమంలో కంపెనీ తన ఓపెన్ రీచ్ బ్రాడ్ బ్యాండ్ నెట్​వర్క్ విభాగాన్ని టెలికాం వాణిజ్యం నుంచి విడదీయాలని యోచిస్తోంది.

గతేడాది ఫిబ్రవరిలో సీఈవో మార్పు తర్వాత కంపెనీ ఇటలీ (Italy), ఐరిష్(Ireland) ప్రాంతాల్లో తమ వాణిజ్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విజయవంతం కావడంతో కంపెనీ షేర్ల విలువ ఏకంగా 65 శాతం పెరిగింది.